Madhurame - Sameera Bharadwaj

Viewed 0 times


Print this lyrics Print it!

     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Madhurame Lyrics

ఆ... ఆ...
మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే
మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే
మధురమె లాలసయే
మధురం లాలనయే
మధురమె లాహిరిలే
మధురం లాలితమే
మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే
తన ధోంతననాన దిరన
తన ధీం ధీంతనో
తన ధోంతననాన దిరన
తన ధీం ధీంతనో
కాలం పరుగులు ఆపి వీక్షించె అందాలే
మొహం తన్మయమొంది శ్వాసించె గంధాలే
ఊరించి రుచులను మరిగి వణికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలు కవ్వించె దాహాలే
మౌనంగా మధువుల జడిలోన పులకించే ప్రాణాలే
మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే
వీచే గాలులు దాగి చెప్పేనె గుసగుసలే
చూసి ముసి ముసి నవ్వులు చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట అరుదించి ఆకాశం
సగమై సాగరమందే అగుపించె ఆ శాంతం
తీరం ముడి వేసిన దారం తీర్చే ఎద భారాలే
మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే
మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే
మధురమె లాలసయే
మధురం లాలనయే
మధురమె లాహిరిలే
మధురం లాలితమే
మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే

Lyrics provided by LyricsEver.com